ముగిసిన పోసాని సీఐడీ విచారణ 1 y ago
AP : సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళీ సీఐడీ విచారణ ముగిసింది. గుంటూరు జైలు లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని సుమారు నాలుగు గంటలపాటు ప్రశ్నించారు అనంతరం పోసానిని కోర్టులో హాజరుపరిచారు. పోసానిని మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది.